గ్రాండ్ గా సోల్ జిమ్ రీలాంచ్ ఈవెంట్

0
23

హైదరాబాద్ 11th Aug 2018: సెలూన్, స్పా, జిమ్ విభాగంలో సోల్ జిమ్ సెంటర్ కు ఎంతటి పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సోల్ జిమ్ రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ రీ లాంచ్ ఈవెంట్ కు మిసెస్ యూనివర్స్ 2017, సర్టిఫైడ్ ఫిట్ నెస్ కోచ్ అభిమానిక, హ్యాష్ ట్యాగ్ మార్కెటింగ్ ఫౌండర్, ది హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఫెస్టివర్ పార్ట్ నర్ గుల్నర్ విర్క్ మరియు మోడల్ & ఫిలింస్టార్ వర్ధన్  హాజరయ్యారు.

ఈ సందర్భంగా సోల్ మేనేజింగ్ పార్ట్ నర్ షీతల్ బంగుర్ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ రోడ్.నెం.36లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన సోల్ జిమ్ లో ఫిట్ నెస్, వెల్ నెస్, బ్యూటీకి సంబంధించిన సేవలు ఒకే దగ్గర ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రీమియం సేవల్ని ఇక్కడ అందించనున్నాం. బేగంపేట, బంజారా హిల్స్, మాదాపూర్ లో సోల్ జిమ్ బ్రాంచ్ లు ఏర్పాటు చేశాం. త్వరలోనే ఫిలింనగర్ లో కూడా సోల్ జిమ్ అందుబాటులోకి రానుంది. సెలూన్, స్పా, జిమ్ విభాగంలో సోల్ జిమ్ కు ప్రత్యేకమైన పేరుంది. ఇప్పుడు రీ లాంచ్ తో మరిన్ని అత్యాధునిక సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. సోల్ జిమ్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. వినియోగదారుల ఆరోగ్యాన్ని, అందాన్ని మరింత మెరుగు పరిచే విధంగా ఇక్కడ సేవలుంటాయని ధీమాగా చెప్పగలం. దీనికోసం ఏంతో నైపుణ్యం ఉన్న ట్రైనర్స్ అందుబాటులో ఉంటారు. అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here