మాగ్నెట్ ఫస్ట్ లుక్ విడుదల. ఈ  సారి యూత్ కి అందాల జాతర ఇస్తానంటున్న సాక్షి చౌదరి.

0
14
Magnet First Look

మాగ్నెట్ ఫస్ట్ లుక్ విడుదల. ఈ  సారి యూత్ కి అందాల జాతర ఇస్తానంటున్న సాక్షి చౌదరి.

పోటుగాడు, జేమ్స్ బాండ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ సాక్షి చౌదరి. చేసిన ప్రతి సినిమాలోనూ అందాల ఆరబోత చేస్తూ ఇప్పుడు సాక్షి చౌదరి ప్రధాన కథానాయకగా ఎమ్.ఏ.ఏస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాగ్నెట్. సాక్షి చౌదరితో పాటు, ఒక ప్రత్యేక పాత్రలో పోసాని కృష్ణ మురళి, భరణి, అభినవ్ సర్ధార్,  అప్పారావు, గెటప్ శ్రీను, రాకేష్, సందీప్తి, అక్షిత,  మరియ తదితరులు ల నటిస్తూ,  లవ్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా  లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ఏం.శివా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు విడుదల అయిన మాగ్నెట్ సినిమా ఫస్ట్ లుక్ యూత్ కి అయస్కాంతం లా అతుక్కుపోతుంది. సాక్షి చౌదరి మరోసారి అందాల ఆరబోత డోసు పెంచినట్టు అర్ధమవుతుంది. ఈ చిత్రానికి కెమెరా శంకర్, మ్యూజిక్ డాక్టర్ కిషన్, ఎడిటర్ నందమూరి హరి, ఆర్ట్ విజయ్ కృష్ణ, లిరిక్స్ రామ్ పైడిసేట్టి, శ్రీ గణేష్, రచన – దర్శకత్వం ఎమ్. ఏ.ఏస్ రెడ్డి. త్వరలో ఒక ప్రముఖ వ్యక్తితో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఫస్ట్ లుక్ తోనే యూత్ విపరీతంగా ఆకట్టుకున్న ఈ మాగ్నెట్ చిత్ర టీజర్ ఇంకెన్ని సంచనాలు సృష్టింస్తుందో చూద్దాం.
Magnet First Look

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here