సంజ‌య్ ద‌త్ హీరోగా బాలీవుడ్ ప్ర‌స్థానం..

0
115
బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ప్ర‌స్థానం హిందీ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన దేవాక‌ట్టానే హిందీలోనూ ద‌ర్శ‌కుడు. అక్క‌డ సాయికుమార్ పాత్ర‌ను ఖ‌ల్ నాయ‌క్ సంజ‌య్ ద‌త్.. శ‌ర్వానంద్ పాత్ర‌లో అలీ ఫాజ‌ల్ న‌టించ‌నున్నారు. 2010లో విడుద‌లైన‌ ప్ర‌స్థానంకు ఎన్నో అవార్డులు వ‌చ్చాయి. ఇక శ‌ర్వానంద్, సాయికుమార్ కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ప్ర‌స్థానం గోవాలో జరిగిన ఇండియ‌న్ ప‌నోర‌మా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు కూడా ఎంపికైంది. ఈ క‌థ న‌చ్చి సంజ‌య్ ద‌త్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ సంస్థ‌లో ఆయ‌నే సినిమాను నిర్మిస్తున్నారు. అమైరా ద‌స్తూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. జూన్ 1న సంజ‌య్ ద‌త్ త‌ల్లి న‌ర్గీస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్నారు.
న‌టీన‌టులు:
సంజ‌య్ ద‌త్, అలీ ఫాజల్, అమైరా ద‌స్తూర్..
టెక్నిక‌ల్ టీం:
ద‌ర్శ‌కుడు: దేవాక‌ట్టా
నిర్మాత‌: స‌ంజ‌య్ ద‌త్
నిర్మాణ సంస్థ‌: స‌ంజ‌య్ ద‌త్ ప్రొడ‌క్ష‌న్ ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఆక‌ర్ష‌న్ ఎంట‌ర్ టైన్మెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here